VIDEO: గుడిపల్లిలో అద్భుత దీపోత్సవం
SS: సోమందేపల్లి మండలం గుడిపల్లి గ్రామంలో సజ్జగంట రంగనాథుని 101వ బ్రహ్మోత్సవాలు శుక్రవారం కనివిని ఎరుగని రీతిలో ఘనంగా నిర్వహించారు. దీపోత్సవంతో ఆలయం పరిసరాలు వెలుగులతో మెరిసిపోయాయి. ఈ సందర్భంగా భక్తులు గోవింద నామస్మరణతో గ్రామమంతా మార్మోగించారు. భారీ సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.