ఆటో పై పడ్డ తాడిచెట్టు

కృష్ణా: ఉంగుటూరు మండలంలో బుధవారం ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నందమూరు గ్రామంలో మంగళవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షం కారణంగా రహదారిపై నిలిచిన ఆటోపై తాటి చెట్టు విరిగి పడింది. ఈ ఘటనలో ఆటోలో ఉన్న పలువురు గాయపడ్డారు. దీంతో వాహనదారులకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.