ఎంపీ విడుదలపై ప్రత్యేక పూజలు

ఎంపీ విడుదలపై ప్రత్యేక పూజలు

CTR: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి వెంటనే విడుదల కావాలని వైసీపీ నాయకులు బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. ఊటుపల్లె పంచాయతీ పుట్టావారిపల్లె మల్లికార్జున స్వామి ఆలయంలో జడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టెంకాయలు కొట్టి, పూజలు చేశారు. పెద్దిరెడ్డి కుటుంబాన్ని వేధించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్లు ఆయన ఆరోపించారు.