ట్రాక్టర్‌పై నుంచి పడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
NRML: సోన్ మండలం పాక్ పట్ల గ్రామంలో మంగళవారం కట్టెలు కొట్టడానికి వెళ్లిన ఒల్లెపు మహేష్ అనే వ్యక్తి ట్రాక్టర్‌పై నుంచి కిందపడి మృతి చెందాడు. మహేష్‌కు ఫిట్ రావడంతో అతను కిందపడిపోయాడు. తలకు తీవ్ర గాయాలు కావడంతో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై గోపి తెలిపారు.