స్మశాన వాటిక సమస్యలను పరిష్కరించాలని డిమాండ్

MHBD: పట్టణంలోని 17, 18వ వార్డుల హిందూ స్మశాన వాటికలో నీటి, కరెంట్, సౌకర్యాల లేమిపై సీపీఎం ఆధ్వర్యంలో శనివారం ధర్నా నిర్వహించారు. సీపీఎం పట్టణ కమిటీ సభ్యుడు తోట శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాత్రివేళల్లో సెల్‌ఫోన్ వెలుగులోనే దహనాలు జరుగుతున్నాయని విమర్శించారు. తక్షణమే సమస్యలు పరిష్కరించకపోతే మున్సిపాలిటీని ముట్టడిస్తామని హెచ్చరించారు.