అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

మహబూబ్ నగర్: జడ్చర్ల మున్సిపాలిటీలో పరిధిలో అనుమానాస్పదంగా ఓ యువకుడు మృతిచెందాడు. స్థానికుల వివరాలు.. పట్టణంలోని బీఆర్ రెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన బీహార్‌కు చెందిన రాషద్ ఖాన్ రూం రెంట్‌కు తీసుకుని ఉంటున్నాడు. మంగళవారం బాత్ రూంలో అనుమానాస్పద స్థితిలో మృతిచెంది కనిపించాడు. సమాచారం అందుకున్న సీఐ కమలాకర్, సిబ్బందితో కలిసి ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.