ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్ స్నేహ శబరిష్
HNK: వేలేరు మండల కేంద్రంలోని జిల్లా ప్రజాపరిషత్, మండల పరిషత్ సెకండరీ పాఠశాలలో గల పోలింగ్ కేంద్రాల్లో జరుగుతున్న రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఓటర్ల కోసం కల్పించిన సౌకర్యాలు, భద్రతా చర్యలు, ఓటింగ్ ప్రక్రియను పరిశీలించారు.