కాంగ్రెస్‌పై వ్యతిరేకత కనిపించింది: BJP

కాంగ్రెస్‌పై వ్యతిరేకత కనిపించింది: BJP

TG: పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పై వ్యతిరేకత కనిపించిందని బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చనందుకే కాంగ్రెస్‌పై వ్యతిరేకత పెరిగిందని మండిపడ్డారు. ఇప్పటికైనా 6 గ్యారెంటీలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.