చెన్నూరులో రైతులకు యూరియా పంపిణీ
TPT: గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో రైతులకు యూరియాను తిరుపతి పార్లమెంట్ మహిళా ప్రధాన కార్యదర్శి మట్టం శ్రావణి రెడ్డి పంపిణీ చేశారు. ఇందులో భాగంగా ఆమె మాట్లాడుతూ.. చెన్నూరు గ్రామంలో ప్రతి రైతుకి యూరియా అందిస్తామని, రైతులెవ్వరూ కూడా అధైర్య పడొద్దని తెలిపారు. అనంతరం ప్రస్తుతం గూడూరు సబ్ డివిజన్ పరిధిలో 250 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందన్నారు.