పోలీసుల గస్తీ మధ్య యూరియా పంపిణీ
KMM: బోనకల్లు మండలం రావినూతలలో యూరియా కోసం రైతులు శనివారం భారీగా చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. సహకార సంఘానికి 323 కట్టల యూరియానే రావడంతో ఆధార్ కార్డుల ఆధారంగా కాకుండా సాగు చేసిన భూమి ఆధారంగా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. తోపులాట చోటుచేసుకోవడంతో ఎస్సై పొదిలి వెంకన్న, ఏవో పసులూరు వినయ్‌కూమార్ పోలీస్ బందోబస్తుతో రైతులను శాంతింపజేశారు.