బాల్య వివాహాల నిర్మూలనకు 100 రోజుల కార్యక్రమం
అన్నమయ్య: జిల్లా స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహ ముక్త భారత్ 100 రోజుల అవగాహన కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది. జిల్లా అధికారి హైమవతి మాట్లాడుతూ బాల్య వివాహాలు పిల్లల విద్య, ఆరోగ్యం, భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతాయని, వాటిని నిర్మూలించడం అందరి బాధ్యత అని చెప్పారు. ఈ కార్యక్రమం మూడు దశల్లో నిర్వహించబడుతుందన్నారు.