టీబీ నిర్ధారణకు మాంటెక్స్ పరీక్షలు

KMR: రామారెడ్డి మండలం అన్నారం PHCలో శనివారం టీబీ నిర్ధారణ కోసం మాంటెక్స్ పరీక్షలు నిర్వహించినట్లు మెడికల్ ఆఫీసర్ డా.మానస తెలిపారు. మాంటెక్స్ పరీక్ష నిర్ధారణ అయిన వ్యక్తులకు చికిత్స ఇస్తున్నట్లు పేర్కొన్నారు. తెమడ పరీక్షల ద్వారా వ్యాధి నిర్ధారణ అయితే 6 నెలలు మందులు వాడాలన్నారు. ఈ కార్యక్రమంలో STS శ్యామ్ పాల్గొన్నారు.