అక్రమంగా తరలిస్తున్న ఎరువుల బస్తాలు స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న ఎరువుల బస్తాలు స్వాధీనం

ప్రకాశం: మార్కాపురం పట్టణంలో శుక్రవారం తెల్లావారుజామున ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న దాదాపు 300 బస్తాల అనుమతులేని ఎరువులను వ్యవసాయ అధికారులు పట్టుకున్నారు. వాహనాన్ని సీజ్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అక్రమ ఎరువుల తరలింపుపై అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.