పత్తి క్వింటాలుకు గరిష్ఠ ధర రూ. 6,950

పత్తి క్వింటాలుకు గరిష్ఠ ధర రూ. 6,950

KNR: రెండు రోజుల విరామం అనంతరం సోమవారం జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభమైంది. మార్కెట్‌కు రైతులు 70 వాహనాల్లో 594 క్వింటాళ్ల పత్తిని విక్రయానికి తీసుకురాగా, దీనికి గరిష్ఠంగా క్వింటాకు రూ. 6,950, కనిష్టంగా రూ. 6,000 ధర పలికిందని మార్కెట్ కార్యదర్శి రాజా తెలిపారు. గోనె సంచుల్లో తీసుకొచ్చిన 6 క్వింటాళ్ల పత్తికి గరిష్ఠంగా రూ. 6,500 ధర లభించింది.