గురుకుల పాఠశాలని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
NGKL: వెల్దండ మండల కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ బాలికల గురుకుల పాఠశాలను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇటీవల ఆ పాఠశాలలో ప్రిన్సిపల్‌కు వ్యతిరేకంగా విద్యార్థులు రోడ్డెక్కి ఆందోళన చేసిన నేపథ్యంలో ఆయన పాఠశాలను పరిశీలించారు. అనంతరం ఉపాధ్యాయులతో ప్రత్యేకంగా సమావేశమై విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంపై దృష్టి పెట్టాలని సూచించారు.