ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
SRCL: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో ఫేజ్ ఎన్నికలలో భాగంగా ఏర్పాటు చేసిన పలు ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో ఇంఛార్జ్ కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ బుధవారం పరిశీలించారు. వీర్నపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, ముస్తాబాద్ మండల కేంద్రం, ఆవునూర్ పాఠశాలల్లో, ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాలను పరిశీలించారు.