సికింద్రాబాద్, JBS మార్గాల్లో ట్రాఫిక్ జామ్..!
HYD: సికింద్రాబాద్, జూబ్లీ బస్ స్టేషన్ (JBS) ప్రాంతాల్లో తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ప్రధాన రహదారులపై వాహనాలు నెమ్మదిగా కదులుతూ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీకెండ్ రద్దీ, బస్సుల రాకపోకలు పెరగడం కారణంగా ట్రాఫిక్ మరింతగా నిలిచిపోయింది. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను నియంత్రిస్తూ పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకురావడానికి చర్యలు చేపట్టారు.