జాతి గౌరవాన్ని మరిచిన నెక్కొండ పోస్ట్ ఆఫీస్ సిబ్బంది

WGL: నెక్కొండ మండల కేంద్రంలోని పోస్ట్ ఆఫీస్ కార్యాలయం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు దూరంగా ఉంది. శుక్రవారం దేశవ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటుండగా పోస్ట్ ఆఫీస్ సిబ్బంది జెండా వేడుకలు నిర్వహించలేదు. ఉద్యోగులు కార్యాలయానికి హాజరు కాకపోవడంతో వేడుకలు జరగలేదని స్థానికులు తెలిపారు.