తొలిరోజు 93.49శాతం పింఛన్ల పంపిణీ పూర్తి
ASR: జిల్లాలో సామాజిక పింఛన్ల పంపిణీ ప్రక్రియలో భాగంగా తొలిరోజైన సోమవారం 93.49శాతం మంది లబ్దిదారులకు పెన్షన్ సొమ్మును అందించామని అధికారులు తెలిపారు. జిల్లా 22మండలాల పరిధిలో మొత్తం 1,22,132 మంది పెన్షన్ లబ్దిదారులకు రూ.51కోట్ల 35లక్షల 17వేలు విడుదలైంది. తొలిరోజు సోమవారం రాత్రి 8గ.ల సమయానికి 1,14,404మందికి రూ.48కోట్ల 62వేల 500 పెన్షన్ల సొమ్మును అందించారు.