ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులపై షీ టీమ్ చైతన్యం

సిద్దిపేట జిల్లా షీ టీమ్ ఆధ్వర్యంలో ఇవాళ క్షీర్‌సాగర్ (ములుగు PS), మక్దూంపూర్ (రాజగోపాలపేట PS), కొమురవెల్లి (కొమురవెల్లి PS) పరిధిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈవ్ టీజింగ్, సోషల్ మీడియా వేధింపులు, బాల్యవివాహాలు, మంచి-చెడు స్పర్శ, ట్రాఫిక్ నిబంధనలు, T-SAFE యాప్‌లపై విద్యార్థులకు చైతన్యం కల్పించారు.