షూటింగ్ పోటీల్లో జిల్లా విద్యార్థిని ప్రతిభ

షూటింగ్ పోటీల్లో  జిల్లా  విద్యార్థిని ప్రతిభ

SKLM: సౌత్ జోన్ ఛాంపియన్ షిప్ పోటీల్లో టెక్కలి మండలం తిర్లంగి గ్రామానికి చెందిన 8వ తరగతి విద్యార్థిని వజ్ఞ ప్రణవి ప్రతిభ కనబరిచింది. కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు జరిగిన సీబీఎస్ఈ అండర్-14 షూటింగ్ పోటీల్లో వెండి పథకం సాధించింది. ఎయిర్ రైఫిల్లో400 షూట్లకుగాను 391 పాయింట్లు సాధించింది.