హాలియాలో గంజాయి సరఫరాదారులు అరెస్ట్

NLG: అనుముల మండలం పంగవాణి కుంట వద్ద గంజాయి సరఫరా చేస్తున్న ముగ్గురిని హాలియా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.6 కేజీల గంజాయి, ఒక బైక్, రూ.2000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మిర్యాలగూడ డీఎస్పీ హాలియా పోలీస్ స్టేషన్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో ఈ వివరాలు వెల్లడించారు.