'గోపీచంద్ 33'కి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్!

'గోపీచంద్ 33'కి పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్!

మ్యాచో స్టార్ గోపిచంద్ హీరోగా సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో ఓ భారీ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. 'గోపీచంద్ 33' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ మూవీకి పవర్‌ఫుల్ టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి 'భారత వర్ష' అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు సమాచారం. మరికొన్ని రోజుల్లో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.