అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
WNP: అమరచింత మున్సిపాలిటీ పరిధిలో ఇవాళ మతిస్తిమితం లేని ఖాజా భాను అనే మహిళ బావిలో పడి అనుమానస్పదంగా మృతి చెందినట్లు ఎస్సై స్వాతి తెలిపారు. రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె మృతదేహం ఈపూరి శ్రీనివాసులు అనే రైతు బావిలో కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికితీసి, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.