ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: సీఐ
TPT: దిత్వా తుఫాను ప్రభావంతో నవంబర్ 30, డిసెంబర్ 1వ తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అర్బన్ సీఐ ఏం.బాబి హెచ్చరించారు. ప్రజలు అవసరం లేని ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలని, నదులు, చెరువుల సమీపానికి వెళ్లరాదని తెలిపారు. విద్యుత్ వైర్లు, చెట్ల కింద నిల్చోకూడదని ఆయన సూచించారు.