ఛైర్మన్‌గా చంద్రకళ ఎంపిక – ఉత్కంఠకు ముగింపు
MUG: ములుగు మున్సిపల్ రాజకీయాల్లో కొనసాగిన ఉత్కంఠకు సోమవారం తెరపడింది. తీవ్ర పోటీ, అంతర్గత చర్చల నడుమ చింతనిప్పుల చంద్రకళ మున్సిపల్ ఛైర్మన్‌గా నేడు ఎన్నికయ్యారు. మంత్రి సీతక్క కీలకంగా వ్యవహరించి, పార్టీకి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని చంద్రకళ పేరును ఖరారు చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.