పిట్లం పంచాయతీ సిబ్బందికి ప్రత్యేక ఆరోగ్య శిబిరం

పిట్లం పంచాయతీ సిబ్బందికి ప్రత్యేక ఆరోగ్య శిబిరం

కామారెడ్డి జిల్లాలోని పిట్లం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆదివారం సిబ్బంది కోసం ప్రత్యేక ఆరోగ్య శిబిరం నిర్వహించారు. సర్పంచ్ కుమ్మరి శేఖర్, కార్యదర్శి బలరాం సమక్షంలో ఆశా వర్కర్లు, వైద్య సిబ్బంది పంచాయతీ కార్మికులకు వివిధ ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సూచనలు అందించారు. ప్రజాసేవలో ఉండే సిబ్బంది ఆరోగ్యంపై శ్రద్ధ వహించడంపై గ్రామస్థులు ప్రశంసించారు.