నూతన పెద్ద హరివాణం మండల ప్రతిపాదనపై 6 గ్రామాలు అభ్యంతరం
KRNL: నూతనంగా ఏర్పడనున్న పెద్దహరివాణం మండలంలోకి నారాయణపురం, ధనాపురం, బసాపురం, మదిరి, చాగి, నాగనాథనహళ్లి గ్రామాలు చేర్చడాన్ని ఆయా గ్రామాల నాయకులు ఇవాళ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ గ్రామాల నుంచి మండల కేంద్రానికి 25KM నుంచి 35KM వరకు ఉంటుందన్నారు. ఎక్కువ దూరం ఉండటం వల్ల ప్రభుత్వ సేవలు, పరిపాలనా కార్యక్రమాల నిమిత్తం ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని పేర్కొన్నారు.