నేడు నగరానికి రానున్న మాజీ సీఎం
GNTR: వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బుధవారం ఉదయం గుంటూరు నగరానికి రానున్నారు. మాజీ మంత్రి అంబటి నివాసం వద్ద జరిగిన దాడి నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. తాడేపల్లిలోని నివాసం నుంచి ఉదయం 10 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి 11 గంటలకు అంబటి రాంబాబు ఇంటికి చేరుకుంటారని పార్టీ ప్రతినిధులు తెలిపారు.