వ్యక్తిపై ఎలుగుబంటి దాడి

వ్యక్తిపై ఎలుగుబంటి దాడి

అనంతపురం: కళ్యాణదుర్గం మండలం దొడగట్ట గ్రామ సమీపంలో రాత్రి ఓ వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసింది. గాయపడ్డ వ్యక్తిని స్థానికులు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎలుగుబంటి పట్టణ శివారులో సంచరిస్తూ తమను భయాందోళనకు గురిచేస్తోందని స్థానికులు తెలిపారు. అటవీశాఖ అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని కోరారు.