పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న 10వ తరగతి ప్రశ్న పత్రాలు

పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న 10వ తరగతి ప్రశ్న పత్రాలు

ELR: ఈనెల 16న నిర్వహించబోయే పదో తరగతి పరీక్ష ప్రశ్న పత్రాలు శుక్రవారం జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాయి. జంగారెడ్డిగూడెం మండల వ్యాప్తంగా తొమ్మిది సెంటర్లలో నిర్వహించబోయే ఈ పరీక్షలకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు ఉదయం 9 గంటలకే చేరుకోవాలని సూచించారు.