కొన్నేళ్ల సమస్యకు పరిష్కారం చూపిన కలెక్టర్

కొన్నేళ్ల సమస్యకు పరిష్కారం చూపిన కలెక్టర్

సత్యసాయి: కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ చూపిన చొరవతో తమ భూ సమస్య పరిష్కారమైందని అర్జీదారుడు రాజశేఖరప్ప సోమవారం కలెక్టర్‌ను సన్మానించారు. గోరంట్ల మండలం బూదిలిలో ఏళ్ల తరబడి నెలకొన్న ఈ సమస్యను కలెక్టర్ పరిష్కరించారని రాజశేఖరప్ప పేర్కొన్నారు. ఇవాళ పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమంలో కలెక్టర్‌ను కలిసి పూలదండ, శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.