బోయకొండలో పెరిగిన భక్తుల రద్దీ

బోయకొండలో పెరిగిన భక్తుల రద్దీ

CTR: ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. వేసవి సెలవుల నేపథ్యంలో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఉదయం 6 గంటల నుంచే క్యూలైన్లలో భక్తులు దర్శనానికి బారులుదీరారు. ఇప్పటికే 20వేల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ ఉప కమిషనర్ ఏకాంబరం ఏర్పాట్లను పర్యవేక్షించారు.