'శివారు ప్రాంతాలకు రక్షిత మంచినీటిని అందించాలి'

'శివారు ప్రాంతాలకు రక్షిత మంచినీటిని అందించాలి'

NLG: నల్లగొండ పట్టణంలోని శివారు ప్రాంతాలైన 9వ వార్డు నడ్డివారి గూడెం, లాలయగూడెం, గంధం వారి గూడెంలో రక్షిత మంచినీరు అందించాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ సలీం, పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సీపీఎం ప్రజా సమస్యల అధ్యయన యాత్రలో భాగంగా మంగళవారం ఆయా వార్డుల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.