'పరిసరాల పరిశుభ్రతతో వ్యాధులకు దూరం'

ప్రకాశం: పరిసరాలు పరిశుభ్రతతో వ్యాధులకు దూరమవుతామని కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ అన్నారు. సోమవారం 7వ వార్డు అలీ మజీద్ ప్రాంతంలో ఛైర్మన్ పర్యటించారు. ఆయన మాట్లాడుతూ.. పట్టణ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని, వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వ్యాధులు ధరి చేరవన్నారు. వర్షాకాలం నేపథ్యంలో ప్రజలు ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలన్నారు.