'తిరుమలాయపాలెం తహశీల్దార్ కార్యాలయ భవనం మార్పు'

KMM: తిరుమలాయపాలెం తహశీల్దార్ కార్యాలయాన్ని అద్దె భవనంలోకి మార్చడం జరిగిందని మండల రెవెన్యూ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. తహశీల్దార్ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో కొత్తగా అద్దె భవనంలోకి మార్చడం జరిగిందని చెప్పారు. ఈ విషయాన్ని మండల ప్రజలు గమనించాలని సూచించారు. భవనం చిరునామా: ఇం.నెం.5-204/1, పోలీస్ స్టేషన్ ప్రక్క వీధిలో, BC కాలనీ, తిరుమలాయపాలెం.