పరీక్ష సరిగా రాయలేదని విద్యార్థి ఆత్మహత్య

పరీక్ష సరిగా రాయలేదని విద్యార్థి ఆత్మహత్య

TG: జగిత్యాల జిల్లా గ్రామీణ మండలం చలగల్‌లో నీట్ పరీక్ష రాసిన విద్యార్థిని జంగ పూజ ఆత్మహత్యకు పాల్పడింది. గతంలో రెండుసార్లు,  ఆదివారం మరోసారి నీట్ పరీక్షకు హాజరైంది. 'కీ' చెక్ చేసుకోగా తక్కువ ర్యాంకు వస్తున్నట్లు చూపించడంతో పూజ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.