సిటీ పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

సిటీ పోలీస్ యాక్ట్ అమలు: ఎస్పీ

JGL: మే 1వ తేది నుండి 31 వరకు జిల్లా వ్యాప్తంగా సిటీ పోలీసు యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. దీని ప్రకారం పోలీసు అధికారుల అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, రాస్తా రోకోలు, నిరసనలు, ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లు, సభలు, సమావేశాలు నిర్వహించరాదని అన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే విధంగా వ్యవహరించొద్దని కోరారు.