బొపునారంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం
VKB: బంట్వారం మండలం బొపునారంలో ఉపాధి హామీ పనులను సర్పంచ్ నరేందర్ రెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్ సోమవారం ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. గ్రామీణ కూలీలకు స్థానికంగా పనులు కల్పించడమే ఈ పథకం లక్ష్యమన్నారు. కూలీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్, కారోబార్ నరసింహులు, పెద్ద సంఖ్యలో కూలీలు పాల్గొన్నారు.