బేతి విక్రమ్‌ను సన్మానించిన సర్పంచ్
HNK: ఐనవోలు మండలం గర్మిళ్లపల్లి గ్రామానికి చెందిన బేతి విక్రమ్ యూపీఎస్సీ ఫలితాల్లో 472 ర్యాంక్ సాధించి సత్తా చాటాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామ సర్పంచ్ గబ్బెట రోజ, ఉప సర్పంచ్ ఈరబోయిన ఎల్లగౌడ్ విక్రమ్ ను ఘనంగా సన్మానించారు. విక్రమ్ యూపీఎస్సీలో సత్తా చాటడం గ్రామానికి గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ వార్డు మెంబర్‌లు, గ్రామస్థులు పాల్గొన్నారు.