25 శాతం పెరిగిన ఐఫోన్ల సరఫరా

టెక్ దిగ్గజం యాపిల్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ ఐఫోన్ల సరఫరా ప్రస్తుత ఏడాది మార్చి నాటికి 25 శాతం పెరిగిందని సైబర్‌మీడియా రీసెర్చ్ ప్రకటనలో తెలిపింది. భారత స్మార్ట్‌ఫోన్ పరిశ్రమలో ఐఫోన్ 8 శాతం మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ఇదే సమయంలో చైనా బ్రాండ్ వీవో 20 శాతం వాటాతో అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాత శాంసంగ్ 18 శాతం రెండో స్థానం, 13 శాతంతో షావోమీ 3వ స్థానంలో ఉంది.