'అన్నదాతలు అభ్యంతరాలు తెలియజేయాలి'
VZM: పురిటిపెంట, ఎం.వెంకటాపురం గ్రామాల్లో ఏఎంసీ ఛైర్మన్ గోపాలరాజు అధ్యక్షతన గ్రామ సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా గజపతినగరం సబ్ డివిజన్ ఏడీఏ నిర్మల జ్యోతి మాట్లాడుతూ.. ఈ-పంట నమోదు చేసిన రైతుల జాబితాలలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలపాలని కోరారు. అలాగే సవరించిన తుది జాబితాను ఈనెల 17వ తేదీన విడుదల చేస్తామన్నారు.