అమెరికా టెక్సాస్‌లో భారీ పేలుడు
అమెరికా టెక్సాస్‌లోని వలేరో రఫైనరీలో భారీ పేలుడు సంభవించింది. రిఫైనరీ పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు ఆకాశాన్ని కమ్మేశాయి. ఆ ప్రాంత వాసులు ఇళ్లకే పరిమితం కావాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదానికి గల కారణాలపై స్థానిక యంత్రాంగం ఆరా తీస్తోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.