ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్

ఎర్రచందనం స్మగ్లర్ అరెస్ట్

TPT: తిరుపతి RSASTF బృందం భారీ ఆపరేషన్‌లో అంతరాష్ట్ర స్మగ్లర్ రామకృష్ణను అరెస్ట్ చేసింది. శేషాచలం అడవుల్లో అక్రమ రవాణా చేస్తుండగా పట్టుబడిన నిందితుడి వద్ద నుంచి రూ. 20 లక్షల విలువైన 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. గతంలోనూ ఇతనిపై పలు కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎర్రచందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతామని టాస్క్ ఫోర్స్ బృందం హెచ్చరించింది.