VIDEO: 'భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించేలా చర్యలు'
కోనసీమ: జిల్లాలోని బాణాసంచా నిల్వ కేంద్రాలు, తయారీ కేంద్రాలలో తప్పనిసరిగా భద్రతా నియమాలు పాటించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని జాయింట్ కలెక్టర్ నిశాంతి సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద అధికారులతో ఆమె సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ బాణాసంచా నిల్వ కేంద్రంలోనూ ముడి సరుకులైన ఎక్కువ నిల్వ చేయరాదని ఆమె సూచించారు.