అక్రమ రేషన్ బియ్యం పట్టివేత
KMR: అక్రమంగా నిల్వఉంచిన రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ డీటీ కిష్టయ్య తెలిపారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ కాలనీ చెందిన ఆదిల్ ఇంట్లో బియ్యం నిల్వలు ఉన్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో వెళ్లి పట్టుకున్నట్లు తెలిపారు. 9.60 క్వింటల బియ్యం పట్టుకుని కేసు నమోదు చేసినట్లు డీటీ తెలిపారు. బియ్యాని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.