దసరాకు తాత్కాలిక భృతి చెల్లించాలని GHMC కార్మికుల ధర్నా

దసరాకు తాత్కాలిక భృతి చెల్లించాలని GHMC కార్మికుల ధర్నా

హైదరాబాద్‌లోని GHMC స్టాఫ్ వర్కర్స్ యూనియన్ ఎల్బీ నగర్ జోన్ కార్యదర్శి మద్దిలేటి నేతృత్వంలో కార్మికులు ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో పీఆర్సీ అమలు చేయడం లేదని, దసరా పండగ సందర్భంగా కార్మికులకు తాత్కాలిక భృతి కింద రూ.6 వేలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే, పర్మినెంట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు దసరా సెలవులతో కూడిన CL ఇవ్వాలని కార్మికులు కోరారు.