భూభారతి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి: కలెక్టర్

HNK: భూభారతి చట్టంలో వచ్చిన దరఖాస్తులను పరిశీలించి రైతులకు తగు న్యాయం చేయడానికి అధికారులు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం రాత్రి భూభారతి చట్టంపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు రమేష్ రాథోడ్, డాక్టర్ కే నారాయణ తహసీల్దార్లు పాల్గొన్నారు.