రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు
అన్నమయ్య: పెద్దమండెం మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తురకపల్లి గ్రామానికి చెందిన రైతు వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డాడు. వెలిగల్లు వెళ్తుండగా, మార్గమధ్యంలో బ్రిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇచ్చే క్రమంలో బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. వెంటనే 108 వాహనం ద్వారా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.