'గిరిజన హోమ్ స్టేలను వెంటనే రద్దు చేయాలి'
ASR: గిరిజన గ్రామాల్లో హోమ్ స్టే పర్యాటకాలను వెంటనే రద్దు చేయాలని పీసీసీ డెలిగేట్ మెంబర్ పాచిపెంట చిన్న స్వామి బుధవారం ప్రభుత్వాన్ని కోరారు. జిల్లాలో 900 మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని వైద్యాధికారులు ప్రకటించడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అత్యధికంగా అరకులో ఎయిడ్స్ కేసులు ఉండడం బాధాకరమన్నారు. నిర్భందం లేకుండా పర్యాటకుల ప్రవేశమే దీనికి కారణమన్నారు.